కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తూ సెల్ఫ్ బౌల్డ్ అయింది
ఒక్క పేదవాడి ఇల్లూ కూల్చకుండానే మేము అభివృద్ధి చేశాం: హరీశ్‌రావు
తుర్కయాంజాల్: పేదల ఇళ్ల జోలికెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి హిట్ వికెట్ అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని జేబీ క్రికెట్ గ్రౌండ్స్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత మాధవరం నర్సింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ చాంపియన్ ట్రోఫీ– 2024 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి హరీశ్ ముఖ్య అతిథిగా హాజర య్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క పేదవాడి ఇల్లు కూల్చకుండానే తాము అభివృద్ధి చేశామన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తూ సెల్ఫ్ బౌల్డ్ అయిందన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
కళాశాలల యాజమా న్యాలు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే.. 8 శాతం కమీషన్ అడుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒకేఒక్కడు కేసీఆర్: హరీశ్ రావు
‘సహజంగా ఎవరైనా పవర్‌లో ఉన్న పార్టీ కోసం సినిమా తీస్తారు. కానీ, అధికారంలో లేకపోయినా కేసీఆర్‌పై సినిమా తీశాడంటే అది రాకేష్‌లో ఉన్న ప్రేమ అనుకోవచ్చు, లేకుంటే దమ్ము, ధైర్యం అనుకోవచ్చు. ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకేఒక్కడు కేసీఆర్. ఆ అవకాశం ఇంకొకరికి లేదు’ అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు.
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్) ప్రీ రిలీజ్ వేడుకలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘కేసీఆర్‌పై రాకేష్ ఒక అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. ఈ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు.
రజనీకాంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు.. 22 ఏళ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను.. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అని అన్నారు. అంటే కేసీఆర్‌గారు పల్లెల్నీ అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌నీ అభివృద్ధి చేశారు.’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment