న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఆమె ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జుల సమావేశంలో మాట్లాడారు. ఎన్డీయే సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. వివిధ కీలక అంశాల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. హరిత విప్లవం ఫలితాలను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలు కోట్లాది రైతులు, కౌలుదారులు, కూలీల పాలిట మరణ శాసనాలేనని అన్నారు. కేంద్ర సర్కారు కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే కరోనా విజృంభిస్తోందని ఆరోపించారు. 21 రోజుల్లో కరోనాను ఓడిస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులపై అరాచకాలు పెరిగిపోయాయని, బాధితుల గొంతులను నొక్కేయడమేనా కొత్త రాజధర్మం అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment