చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ రావడం లేదు: మంత్రి కాకాణి | Kakani Govardhan Reddy Slams On Chandrababu Over Raa Kadali Ra | Sakshi
Sakshi News home page

‘మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’

Published Sat, Jan 20 2024 4:46 PM | Last Updated on Fri, Feb 2 2024 9:20 PM

Kakani Govardhan Reddy Slams On Chandrababu Over Raa Kadali Ra - Sakshi

సాక్షి, నెల్లూరు: వెంకటగిరిలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ‘రా.. కదలి రా’ ప్రోగ్రాం అట్టర్ ప్లాఫ్‌ అని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు.. డబ్బులిచ్చి మరీ జనాలను తరలించారని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు. చప్పట్లు కాదు.. చంద్రబాబును చెప్పులతో కొట్టాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకి దమ్ము, దైర్యం, నీతి నిజాయితీ ఉంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. రాజకీయాల్లో తన అవినీతి మీద సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా? అని సూటిగా  ప్రశ్నించారు. 

కోర్టులకి వెళ్లడం స్టే తెచ్చుకోవడం చంద్రబాబు అవినీతికి పరాకాష్ట అని మండిడ్డారు. స్కిల్ స్కాం, ఔటర్ రింగ్ రోడ్ మీద సీబీఐ విచారణ కోరి చంద్రబాబు పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు బలహీనుడు, అసమర్డుడు, రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి అని విర్శించారు. వ్యవసాయ రంగం మీద జరిగిన అభివృద్ధి మీద ఛాలెంజ్ విసిరితే.. తోక ముడుచుకుని చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే.. రాష్ట్ర ప్రజలు, యువత ఆయన్ని ఎందుకు తరిమెస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు మార్క్ సంక్షేమ పథకం ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు. తమ ప్రభుత్వ పథకాలను పక్క రాష్ట్రంలో అమలు అవుతున్న వాటిని.. కాపీ కొట్టాలనుకునే దౌర్బాగ్యడు చంద్రబాబు బాబు అని మండిపడ్డారు. మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని అన్నారు.

చదవండి: టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement