
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా ప్రతీ బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపించిందన్నారు కేటీఆర్. కేంద్రమంత్రిగా బండి సంజయ్ సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని కోరారు.
కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తాజాగా కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో..‘ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురండి. పదేళ్లుగా ప్రతీ బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. అనేకసార్లు పవర్ లూమ్ క్లస్టర్ కోసం కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
ఈసారైనా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తెప్పించండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయి. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి.
♦️ ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకురండి
♦️ కేంద్రమంత్రి బండి సంజయ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బహిరంగ లేఖ
♦️ పదేళ్లుగా ప్రతి బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింది
♦️ అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు… pic.twitter.com/Gc1VCfn7VY— BRS Party (@BRSparty) July 11, 2024
కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల చేనేత రంగం సంక్షోభంలోకి వెళ్లింది. నేతన్నలను ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్ ఫేయిల్ అయ్యింది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని సూచన చేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.