
ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్‌కు..
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో పవన్ ఓ అనైతిక రాజకీయవేత్త అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. తాజాగా మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘పవన్ కల్యాణ్ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకంగా ఉన్నాయి. పవన్ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడు. ఓట్లు కొనుక్కోకూడదని చెగువేరాలాగా పవన్ కాకమ్మ కథలు చెప్పాడు. మళ్లీ మాట మార్చి ఓట్లు కొనుక్కోమంటూ తన కేడర్‌కు పవన్ లైసెన్స్ ఇచ్చాడు’ అని కామెంట్స్ చేశారు.