సాక్షి, హైదరాబాద్: ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తామని పార్లమెంటు బహిష్కరించి వచ్చి పది రోజులు గడుస్తున్నా టీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు నోరువిప్పడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత రాకుండానే పార్లమెంటును బహిష్కరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రకటించారంటే.. టీఆర్‌ఎస్–బీజేపీల మధ్య తెరవెనుక ఒప్పందం జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు.
ఢిల్లీలో తెలంగాణ ఎంపీలతో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఎంపీలను తిరిగి ఎందుకు హైదరాబాద్‌కు రప్పించాడో చెప్పాలని శుక్రవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 20 శాతం వరి కోతలు మిగిలి ఉన్నాయని, మరో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి 1982 కొనుగోలు కేంద్రాలను మూసి వేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా 70 రోజుల్లో 206 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు
Comments
Please login to add a commentAdd a comment