సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల లో ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ మార్కెట్ యార్డులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి సూచించారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు 40 శాతం ధాన్యమే కొన్నారు. ఇంకా 60 శాతం కొనాల్సి ఉంది. గోనె సంచులు, రవాణాకోసం లారీలులేక రైతులు రోజుల తర బడి వరి కుప్పల మీదే నిద్రించాల్సి వస్తోంది.
మీరు ఆకస్మిక తనిఖీలు చేసి నేరుగా రైతులతో మాట్లాడితే క్షేత్రస్థాయి సమస్యలేంటో తెలుస్తాయి. రైతాంగ సమస్యలను పరిష్కరిస్తే మీకే మంచి పేరు వస్తుంది’అని అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన వారి ధాన్యాన్నే అధికారులు కొంటున్నారని, మిగిలిన రైతు లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment