
సాక్షి, కాకినాడ: చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వారికి ఒంటిరిగా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్‌కే ప్రజలు మద్దతు ఉంటుందని, ప్రతిపక్షాలు ఎలా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి.