పచ్చ గద్ద | Sakshi
Sakshi News home page

పచ్చ గద్ద

Published Wed, May 8 2024 5:00 AM

పచ్చ

అభివృద్ధి పనుల నిధుల్లో పర్సెంటేజీలు నొక్కడం.. అడ్డగోలుగా పనులు చేస్తున్నా కిమ్మనకుండా చోద్యం చూడటం.. భూములు కబ్జా చేసి అప్పనంగా సొమ్ము చేసుకోవడం.. ఇసుకను తెగనమ్మి జేబులు నింపుకోవడం.. పేదలకు న్యాయంగా దక్కాల్సిన పథకాలకు ఉద్దేశపూర్వకంగా కత్తెర వేయడం.. ఇదీ 2014–19 మధ్య టీడీపీ జమానాలో సంతనూతలపాడు నియోజకవర్గంలో పచ్చ నేతల వ్యవహార శైలి. అక్రమాలకు అడ్డు తగిలిన వారిపై కేసులు బనాయించి, సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ సైతం రద్దు చేయించడంలో బీఎన్‌ విజయ్‌కుమార్‌ చూపిన అత్యుత్సాహాన్ని నియోజకవర్గ ప్రజలు ఇంకా మరువలేదు. గత ఎన్నికల్లోనూ ఇక్కడ తుకై ్కన సైకిల్‌కు మరమ్మతులు చేసి మళ్లీ పెత్తనం చేయాలని ఆయన తహతహలాడుతున్నారు.
పేరుకే పెద్ద..

సాక్షి నెట్‌వర్క్‌ : సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో టీడీపీ నేతలు రోజుకు 300 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా రవాణా చేసి రూ.కోట్లు సంపాదించారు. మల్లవరం, కొలచనకోట, వెల్లంపల్లి, గాజులపాలెం, మద్దిపాడు, రాచవారిపాలెం, నందిపాడు, ఇనమనమెళ్లూరు గ్రామాల్లో వారు ఇస్టానుసారంగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకున్నారు. మల్లవరం వద్ద ఇసుక రీచ్‌ ఏర్పాటు చేస్తే తమ పొలాలు పోతాయని అన్నంగి గ్రామస్తులు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారు. పొలాల అంచుల్లో ఇసుక తోడుతుండడంతో మట్టిపెళ్లలు విరిగి పడి సన్నపోగు చిన్నయ్య(49) అనే ట్రాక్టర్‌ డైవర్‌ మరణించాడు. అప్పటి తహసీల్దార్‌ ఇసుక రీచ్‌ను మూసివేసినా టీడీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి మళ్లీ తవ్వేందుకు అనుమతిచ్చారు. ఈ అక్రమాలు, అరాచకాల వెనుక బీఎన్‌ విజయ్‌కుమార్‌ ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాసులు కురిపించిన నీరు–చెట్టు

టీడీపీ జమానాలో 2015 నుంచి 2018 వరకు నియోజకవర్గంలో 529 పనులు మంజూరు కాగా రూ.41.12 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో సుమారు రూ.20 కోట్లు టీడీపీ ముఖ్య నేతలు, వారి అనుచరుల జేబుల్లోకే చేరాయి. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్లు, ఇతర యంత్రాలు వినియోగించి, అధికారుల నోరు నొక్కేసి బిల్లులు డ్రా చేసుకున్నారు. ఉపాధి హామీ పనులు చేసిన ప్రదేశాల్లోనే నీరు–చెట్టు పేరుతో పనులు చేపట్టినట్లు చూపి బిల్లులు పొందడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మూడు మీటర్ల కంటే ఎక్కువ లోతు తవ్వకూడదన్న నిబంధనలు తుంగలో తొక్కి మట్టిని తెగనమ్ముకుని అదనంగా సంపాదించుకున్నారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో మాజీ సైనికోద్యోగి నార్నె శ్రీనివాసరావుకు 2006లో ప్రభుత్వం ఇచ్చిన 3.60 ఎకరాల భూమిలో నీరు–చెట్టు కింద చెరువు మట్టి తవ్వేశారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఆ పనికి రూ.10 లక్షలు బిల్లు పెట్టి.. అందులో వచ్చిన మట్టి అమ్ముకుని మరో రూ.10 లక్షలు సంపాదించాడు. ఇదే తరహాలో నియోజకవర్గంలో నీరు–చెట్టు పనుల్లో దోపిడీ సాగింది. విజయ్‌కుమార్‌ అండదండలతో వారు మరింతగా రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.

జన్మభూమి కమిటీల పేరుతో

సంక్షేమానికి కత్తెర

టీడీపీ జమానాలో రాజకీయ నిరుద్యోగులైన కార్యకర్తలకు పదవులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో అధికారికంగా ప్రొటోకాల్‌ కల్పిస్తూ తీసుకొచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రభుత్వ ఇళ్లు, పింఛన్లు, పేదలకు ఇచ్చే రుణాలు, గృహాల మంజూరులో లబ్ధిదారులు టీడీపీకి చెందిన వారేనా.. ? కాదా..? అని ఆరా తీస్తూ, కులాల వారీగా ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారితోపాటు సామాన్యులకు పథకాలు దక్కకుండా జన్మభూమి కమిటీలు చూపిన వివక్ష అంతా ఇంతా కాదు.

ప్రొటోకాల్‌కు తూట్లు

గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబునాయుడు 2014–19లో రాజకీయ కుసంస్కారానికి తెరతీశాడు. ఎమ్మెల్యేలను పూచికపుల్లలా పక్కన పెట్టి ఓడిన టీడీపీ అభ్యర్థులకు పవర్స్‌ కట్టబెట్టేశారు. ఇలాంటి దారుణమైన ప్రోటోకాల్‌ సిస్టం గతంలో ఎప్పుడూ లేదు. 2014 ఎన్నికల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ సీపీ నుంచి ఆదిమూలపు సురేష్‌ గెలుపొందినా.. టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన బీఎన్‌ విజయకుమార్‌కు పెత్తనం అప్పగించారు. అప్పట్లో పోలీసులు విజయకుమార్‌కు సెల్యూట్‌ చేస్తూ స్వాగతం పలికిన దృశ్యాలు చూసిన వారంతా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వ దేశంలో ఉన్నామా? అనే ముక్కున వేలేసుకున్నారు. రామతీర్థం రిజర్వాయర్‌ వద్ద సాగర్‌ జలాలను వదిలే సమయంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు సమాచారం ఇవ్వకపోగా, విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యేను కట్ట నుంచి వెనక్కి నెట్టేసిన బీఎన్‌.విజయకుమార్‌, దామచర్ల జనార్దన్‌ తీరు రాజకీయంగా సంచలనంగా మారింది. టీడీపీ నేతల దుందుడుకు చర్యలపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసిన సురేష్‌, అసెంబ్లీలోనూ ఎండగట్టారు.

కనపర్తి వద్ద ప్రభుత్వ భూమిలో టీడీపీ నేతలు అక్రమంగా

ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులు (ఫైల్‌)

సర్పంచ్‌లపై వేధింపులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలుపొందిన వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల చెక్‌పవర్‌ను రద్దు చేయించడం, ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఏమాత్రం సహకరించకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్న సంఘటనలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. చీమకుర్తి మండలంలోని గాడిపర్తివారిపాలెం సర్పంచ్‌ సూడిదేల సుబ్బరామిరెడ్డి, ఎర్రగుడిపాడు సర్పంచ్‌ గంగిరేకుల వెంకట్రావు చెక్‌పవర్‌ను రద్దు చేయించి ఇష్టారాజ్యంగా వ్యహరించారు.

పెత్తనానికి తహతహ

టీడీపీ జమానాలో సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రజా ధనం లూటీ నీరు–చెట్టు నిధుల దోపిడీ, భూ కబ్జాల్లో పోటీ పడిన పచ్చ చొక్కాలు జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాలకు కత్తెర నాడు.. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులైన సర్పంచ్‌ల చెక్‌పవర్‌ రద్దు తెలుగు తమ్ముళ్ల దోపిడీకి అండగా నిలిచిన బీఎన్‌ విజయ్‌కుమార్‌

పచ్చ గద్ద
1/1

పచ్చ గద్ద

Advertisement
 
Advertisement
 
Advertisement