మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి | Sakshi
Sakshi News home page

మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి

Published Wed, May 8 2024 5:00 AM

మీలో

మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

టంగుటూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ఒకడిగా అందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి, వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మండలంలోని అనంతవరం పంచాయతీ పరిధి తేటుపురం, తాళ్లపాలెం, పసుముద్ర, వెలగపూడి గ్రామాల్లో పల్లె పల్లెకు సిద్ధం కార్యక్రమంలో మంత్రి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ లబ్ధిని దోచేశారన్నారు. సీఎం జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నవరత్నాల్లో చేర్చి అర్హత గలిగిన ప్రతి ఒక్కరికీ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన అందిస్తుంటే కూటమి నేతలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారన్నారు.

వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌లో ఉత్సాహం:

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ప్రచారం విజయపథం వైపు దూసుకెళ్తోంది. కొన్ని నెలల ముందు మాత్రమే నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటికీ తక్కువ సమయంలోనే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 112 పంచాయతీల్లో ప్రచారాన్ని దాదాపు పూర్తి చేశారు. టంగుటూరు మండలంలోని అనంతవరం పంచాయతీలోని తేటుపురంలో యువకులు ఉత్సాహంతో 250 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ మన నేత జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. మహిళలు హారతులు పట్టారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీకి బలమైన ఓటింగ్‌ ఉన్నా నాయకుల మధ్య గ్రూపుల బెడదతో 2014, 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని, ఈ సారి ఆ తప్పిదం జరగనివ్వకుండా చూస్తామని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు కదలాలన్నారు. మనమంతా ఒకే వర్గం.. అది జగనన్న వర్గమని అందరం ఏకతాటిపై ఉండి కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరవేయాలన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, పార్టీ నాయకుడు ఏవీఎస్‌ రాజు, సర్పంచ్‌ ఉప్పలపాటి శివరామరాజు, ఎంపీటీసీ కసుకుర్తి కోటేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్‌ ఉప్పలపాటి నాగరాజు, ఉప్పలపాటి సుబ్బరాజు, శారీమందిర్‌ వెంకటేశ్వర్లు, మర్రి భాస్కరరెడ్డి, రాజు వేణుగోపాలరెడ్డి, రాజు నాగరెడ్డి, మంత్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా చంద్ర, మిడసల సుబ్బారావు, కసుకుర్తి రమేష్‌, కన్నా వెంకట్రావు, కన్నా శ్రీను, తమ్మినేని లక్ష్మి నరసింహస్వామి, మెండా శ్రీను, గుంతోటి శ్రీను, బొడపాటి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి
1/1

మీలో ఒకడినై ఉంటా...ఆదరించండి

Advertisement
 
Advertisement
 
Advertisement