ఒంగోలు టౌన్: ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై ఈ నెల 26వ తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు తంబి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని మస్తాన్ దర్గా వద్ద భవన నిర్మాణ కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు, రైతు చట్టాల రద్దును వ్యతిరేకించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలని నగర కార్యదర్శి సయ్యద్ హుసేన్ డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయాలని, బిల్డింగ్ వర్కర్లకు సంబంధించిన క్లయిమ్‌లు చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment