ఉత్సాహంగా ‘సాక్షి’ స్పెల్‌బీ పోటీలు
ఒంగోలు సిటీ: సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ రెండో లెవల్ పోటీలు ఆదివారం స్థానిక అపెక్స్ హైస్కూల్, ఆంధ్ర హైస్కూల్‌లలో ఉత్సాహంగా జరిగాయి. ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వాఫీ, అసోసియేట్ స్పాన్సర్‌గా రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు వ్యవహరించారు. రెండో లెవల్ లో నాలుగు కేటగిరీల కింద పోటీలు నిర్వహించారు. పోటీలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ పోటీల ను అపెక్స్ హైస్కూల్ కరస్పాండెంట్ కె.శివకోటిరెడ్డి, టీచర్లు అనురాధ, వనజ, శ్రీలక్ష్మీ, ఆంధ్ర హైస్కూల్ కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు, టీచర్లు కోటేశ్వరరావు, కంప్యూటర్ టీచర్ రేష్మా ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘సాక్షి’ యాడ్స్ విభాగం మేనేజరు శర్మ, ప్రతినిధి హనుమంతరావు పర్యవేక్షించారు.
ఇంగ్లిష్ పదాల్లో లోతైన అర్థం
తెలుస్తుంది
‘సాక్షి’ స్పెల్‌బీ మాకు ఎంతో ఉపయోగపడింది. ఇంగ్లిష్‌లో ఉన్న లోతైన అర్థాలు తెలుస్తాయి. అలాగే స్టేజీపై మాట్లాడేందుకు మా భాషను మెరుగుపరుచుకోవచ్చు. ‘సాక్షి’కి ధన్యవాదాలు.
– ఎం.విజిత, 9వ తరగతి
Comments
Please login to add a commentAdd a comment