మీరు ఎట్లుండ్రు.. మీకేం చేయాలి | Sakshi
Sakshi News home page

మీరు ఎట్లుండ్రు.. మీకేం చేయాలి

Published Thu, Feb 29 2024 7:20 PM

- - Sakshi

సిరిసిల్లటౌన్‌: మీ గోస.. గోస కాదు.. మిమ్మల్ని తీ సుకురావడానికి శత విధాలుగా ప్రయత్నించినం.. ఇన్నేళ్లకు తీరింది..ఇప్పుడు మీరు ఎట్లుండ్రు.. మీ పోషణకు నేనేం చేయాలి.. అంటూ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. పద్దెనిమిదేళ్లు జిల్లాకు చెందిన నలుగురు గల్ఫ్‌లో బందీలై విడుదలైన వారిని సిరిసిల్ల శివారులోని పెద్దూరులో బుధవారం కలుసుకుని మాట్లాడారు. 12 ఏళ్లు ఎంతో కష్టపడితే గానీ మీరు జైళ్ల నుంచి బయటకు రాలేదు.. ఇప్పటికీ ఆలస్యమై ంది కానీ.. ఏడేళ్లు ముందు వచ్చిండ్రు.. ఇలా మీ ఇ ంటోళ్లను కలుసుకుండ్రు అన్నారు. మొదటిసారి 2012లో మీరు గల్ఫ్‌ జైళ్లో పడిన సంగతి తెలిసిందన్నారు. పెద్దూరు పెద్దమనుషులు, ఇతరులు నాతో మాట్లాడిండ్రు మీకు ఎలా సాయం చేయాలనేది ఏంతెల్వదు.. ఇంతలోనే రాజశేఖర్‌ సార్‌, నారాయణ తదితరులు సాయం చేయడానికి ముందుకు వ చ్చిండ్రని తెలిపారు. మీ కేసులో మిమ్మల్ని శిక్ష నుంచి తప్పించడానికి అక్కడ మృతి చెందిన కుటుంబసభ్యులకు బ్లడ్‌ మనీ చెల్లించాల్సి ఉంటుందని తెలు సుకున్నం. ఆ కుటుంబసభ్యులకు వాటిని అందించడానికి మేము నేపాల్‌ వచ్చినం. మృతుడి భార్య పిల్లలు ఖాట్మాండు నుంచి 24గంటలు ప్రయాణం చేసి వచ్చిండ్రు పాపం అని వివరించారు. వాళ్లకు పైసలిచ్చినం..అయినా ఇన్నేళ్లు జైల్లో ఉన్నారు.. మీరు వచ్చిండ్రు అదిచాలు.. ఇక ఇక్కడే ఉండి పనిచేసుకోండ్రి నావంతుగా మీరు పనిచేసుకోవడానికి సాయం చేస్తాని హామీ ఇచ్చారు. మీకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం..అయితే మన ప్రభుత్వం ఉంటే మీకు నేను ఏదైనా చేయడానికి అల్కగా ఉంటుండే అన్నారు. మీరు ఏపని చేసుకుంటారో నాకు చెప్పాలని కోరారు. గంట సేపు బాదిత కుటుంబాల సభ్యులతో ఆయన గడిపారు.

ఎక్కడికో పోయి ఇబ్బంది పడొద్దు

మన రాష్ట్రం నుంచి లక్షలాది మంది ఓయాసిస్సులు దాటి దుబాయ్‌ వంటి దేశాలకు వెళ్లి ఇబ్బందులు పాలైతున్నారని ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. పెద్దూరులో గల్ఫ్‌ బాదితులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఉపాధి అవకాశాలున్నా ఉపాధి కోసం లక్షల సంఖ్యలో వెళ్లి ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన జిల్లాకు చెందిన నలుగురు గల్ఫ్‌లో జైల్లో పడ్డ బాధితులను ఉదాహరణగా తీసుకుని స్థానికంగానే ఉపాధి మార్గాలు వెతుక్కోవాలని సూచించారు. కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్‌, బొల్లి రామ్మోహన్‌, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులున్నారు. బాధితుల కన్నీళ్లు..వారి కృతజ్ఞతలతో కేటీఆర్‌ కన్నీటి పర్యంతమై వారికి అండగా నిలుస్తామని హామీ ఇవ్వడం బాధిత కుటుంబాల్లో ధైర్యాన్ని నింపింది.

మా ప్రభుత్వం ఉంటే అల్కగా చేస్తుంటి

మీరు ఏ పనిచేస్కుంటమన్నా చూస్కుంటా..

గల్ఫ్‌ జైళ్ల నుంచి మీరు వచ్చిండ్రు.. సంతోషం

గల్ఫ్‌ బాధితులతో ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట.. ముచ్చట

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement