వైజ్ఞానిక ప్రదర్శనను జయప్రదం చేయాలి
● డీఈఓ వెంకటేశ్వర్లు పిలుపు ● ఈనెల 21 నుంచి 23 వరకుసంగారెడ్డిలో వైజ్ఞానిక ప్రదర్శన
సంగారెడ్డి ఎడ్యుకేషన్ః విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ నెల 21,22, 23వ తేదీల్లో జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక, జిల్లాస్థాయి ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శనను జయప్రదం చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు కోరారు. గురువారం జిల్లా సైన్స్ కేంద్రంలో 11 కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ...ఈ వైజ్ఞానిక ప్రదర్శనను జయప్రదం చేసేందుకు 11 కమిటీలను నియమించామన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనకు వచ్చే విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా చూడాల్సిన బాధ్యత ఈ కమిటీలదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణ, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, మాజీ సైన్స్ అధికారి విజయ్ కుమార్, నోడల్ అధికారి లింభాజీ, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment