ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్‌ః ఇందిరా క్రాంతి పథకంలో పని చేస్తున్న వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు వారికి కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్యభవన్‌లో గురువారం ఐకేపీ వీఓఏల జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ...సందర్భంగా ఐకేపీ వీఓఏలు గత 20 ఏళ్ల నుంచి అనేక రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ అందేవిధంగా సేవలందిస్తున్నారన్నారు. అయితే వీరికి మాత్రం కనీస వేతనం, చట్టపరమైన సౌకర్యాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాల సందర్భంగా ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నా అవి అమలు చేయడంలో చిత్తశుద్ధి కనిపించడంలేదని మండిపడ్డారు. గ్రామ సంఘాలకు బకాయి ఉన్న సీ్త్రనిధి ఇన్సెంటివ్ ఇవ్వడంతోపాటు ప్రతీ గ్రామ సంఘానికి ఒక ట్యాబ్, నెట్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ జీవో ప్రకారం గ్రామ సంఘం నుంచి రూ.3 వేలు వేతనం ఇవ్వాలని కోరా రు. ఐకేపీ వీఓఏలకు రూ.20 లక్షల బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్ ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగే కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించే ధర్నాకు జిల్లాలోని వీవోఏలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment