కులగణనను విజయవంతం చేయండి
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం కులగణనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించి ఈ సర్వేను ప్రజలు విజయవంతం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. నాగల్గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామంలో గురువారం కులగణనకు సంబంధించిన ప్రక్రియను డోర్ స్టిక్కర్లు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...సర్వేకు గ్రామాలకు వచ్చే అధికారులకు ఇంటి యజమానులు పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. వలసవెళ్లిన వారి కుటుంబ వివరాలను, డోర్ లాక్ చేసి ఉన్న కుటుంబాల వివరాలను గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా కుటుంబసభ్యులకు తెలియపరచి నమోదు చేయించాలన్నారు. రాష్ట్రంలోనే ఖేడ్ నియోజకవర్గం రోల్‌మోడల్‌గా నిలిచేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో ముఖ్య నాయకులు నర్సింగ్‌రావు పాటిల్, గుండేరావు పాటిల్, అనిల్, సంజీవ్, ఆకాశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment