కార్మిక సంక్షేమానికి అహర్నిశలు కృషి | - | Sakshi
Sakshi News home page

కార్మిక సంక్షేమానికి అహర్నిశలు కృషి

Published Fri, Nov 22 2024 7:31 AM | Last Updated on Fri, Nov 22 2024 7:31 AM

కార్మిక సంక్షేమానికి అహర్నిశలు కృషి

కార్మిక సంక్షేమానికి అహర్నిశలు కృషి

కార్మిక నాయకుడు వరప్రసాద్‌ రెడ్డి

జిన్నారం (పటాన్‌చెరు): కార్మిక సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామని రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్‌ రెడ్డి స్పష్టం చేశారు. బొల్లారం పారిశ్రామికవాడలోని ఒస్లోహ్‌ కోగి ఫర్‌ టర్న్‌ అవుట్‌ పరిశ్రమ కార్మికులకు రూ.11,900 మెరుగైన వేతనాన్ని అమలు చేసేలా గురువారం యాజమాన్యంతో చర్చించి తీర్మానించారు. ఈ మేరకు జిల్లా డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో పరిశ్రమ కార్మికులకు నూతన వేతన ఒప్పంద పత్రాలను అందజేశారు. అనంతరం వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ...కార్మిక సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లేబర్‌ కమిషనర్‌ను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పద్మాగౌడ్‌, ముత్యాలరావు, సంతోష్‌, రంజన్‌, కార్మికులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement