వారంలోగా సర్వే డిజిటలైజేషన్ పూర్తి
ఆర్డీవో రవీందర్ రెడ్డి
కంది(సంగారెడ్డి): కులగణన సర్వే డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలని, వారంలోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్డీవో రవీందర్‌రెడ్డి సూచించారు. ఆదివారం కంది ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతున్న సర్వే డిజిటలైజేషన్‌ను ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఫారంను పరిశీలించి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. మండలంలో 12,734 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 90% సర్వే అయినట్లు ఎంపీవో మహేందర్‌రెడ్డి తెలిపారు.
బీజేపీ మతోన్మాదాన్ని
తరిమికొడదాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
చుక్కా రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: దేశంలో మత విద్వేషాలు పెంచేందుకు భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్సెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, బీజేపీ మతోన్మాద రాజకీయాలను అందరూ వ్యతిరేకించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. బీజేపీ నియంతృత్వ పాలనపై నిరంతరం పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని సీపీఎం కార్యాలయంలో ‘మతో న్మాద రాజకీయాలు’ అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మతోన్మాద, విద్వేషశక్తుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందామన్నారు. కులం, మతం పేరిట జరిగే దాడులను అరికట్టేందుకు వామపక్షపార్టీలు ముందుండాలని పిలుపునిచ్చారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు పాలకులు దేశ వనరుల్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. సదస్సులో సీపీఐ జాతీ య కార్యవర్గ సభ్యులు యూసుఫ్ అలీ, సీపీఐ జిల్లా కార్యదర్శి జలాలుద్దీన్, సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, నాయకులు మల్లేశం, రాజయ్య, రాంచందర్, సాయిలు పాల్గొన్నారు.
నిరసనలను
జయప్రదం చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించే నిరసనలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సంగారెడ్డిలోని కేవల్‌కిషన్‌లో నిరసనలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశ ప్రజలు, రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కనీస వేతనం, ఉద్యోగ, సామాజిక భద్ర త, ఎనిమిది గంటల పని దినం హక్కులు వంటివి రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంజీరా ఆవరణలో
కార్తీక వన భోజనాలు
సంగారెడ్డి జోన్: కార్తీక మాసం పురస్కరించు కుని ఆదివారం మంజీరా డ్యామ్ ఆవరణలో జిల్లా వీరశైవ లింగాయత్, లింగ బలిజ ఆధ్వ ర్యంలో వనభోజనాలు నిర్వహించారు. ఈ వనభోజనాలకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి హాజరై కార్తీక మాస విశిష్టతను వివరించారు.
పటాన్‌చెరులో...
పటాన్‌చెరు టౌన్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏపీఆర్ కాలనీ వాసులు పటాన్‌చెరులో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. కార్తీక వనసమారాధన, ఆట పాటలతో రోజంతా సరదాగా గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment