రాజ్యాంగంతోనే వెట్టికి విముక్తి
మెదక్‌జోన్: భారత రాజ్యాంగం ద్వారానే బానిస బతుకులకు విముక్తి కలిగిందని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పిలుపునిచ్చారు. ఆదివారం ఇందిరాగాంధీ స్టేడియంలో 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా.. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కులవివక్ష, నేరాలకు భారత రాజ్యాంగం శిక్షలు వేస్తుందన్నారు. దక్షిణ భారతదేశంలో రెండవ రాజధాని ఉండాలని అంబేడ్కర్ ప్రతిపాదించడం ముందుచూపునకు నిదర్శనమని కొనియాడారు. హైకోర్టు న్యాయవాది పొన్నం దేవరాజ్‌గౌడ్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగంతో విద్య, ఉద్యోగాలతో పాటు సంపద చేకూరిందన్నారు. టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ.. దేశంలో నేటికీ కులవివక్ష కొనసాగుతుందని వాపోయారు. అంతకుముందు రాజ్యాంగంపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పొటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment