నేటి నుంచి గుండం బావి జాతర
మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో మాతృశ్రీ జానకమ్మ, రఘునాథస్వామి ఆలయం గుండం బావి జాతర ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆలయపెద్దలు కులకర్ణి నర్సింహారావు ఆదివారం మీడియాకు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. జాతర తొలిరోజు మాతృశ్రీ జానకమ్మ రఘునాథస్వామి వార్ల లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం, 11 గంటలకు కులకర్ణి నర్సింహారావు గృహం నుంచి ఆలయం వరకు శ్రీవార్ల పల్లకీసేవ, ఊరేగింపు నిర్వహించనున్నారు. మంగళవారం శ్రీవార్లకు లఘున్యాస రుద్రాభిషేకం, బిళ్వార్చన, సాయంత్రం 5 గంటలకు బాల మార్తండా మహరాజ్ చైనాయాజి బీదర్ వారితో హరికథ కాలక్షేపం, భజన కార్యక్రమం ఉంటుంది. బుధవారం స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, సాయంత్రం అగ్నిగుండం, గోపాల కళాహారతులు, శ్రీవారి పల్లకీ ఊరేగింపు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment