ఇస్నాపూర్ వరకు మెట్రో విస్తరించాలి
పటాన్చెరు టౌన్: మెట్రోరైల్‌ను మియాపూర్ నుంచి పటాన్చెరు మీదుగా ఇస్నాపూర్ వరకు విస్తరించాలని మెట్రోరైల్ సాధన సమితి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రివర్యులు కిషన్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావులకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును విస్తరించాలని ప్రతిపాదించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీఓలో పటాన్ చెరు వరకు మాత్రమే ప్రతిపాదించిందన్నారు. జిల్లాకు లాభం జరగాలంటే పారిశ్రామికవాడ ఇస్నాపూర్ వరకు మెట్రోను పొడగించాలని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘురందన్ రావుని కోరారు. కార్యక్రమంలో మెట్రో రైల్ సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.
మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక
అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment