నాణ్యమైన భోజనమే వడ్డించాలి
జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి
ఝరాసంగం(జహీరాబాద్): వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి ఆదేశించారు. మండల కేంద్రమైన ఝరాసంగం మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలికల పాఠ శాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతోపాటు దిగ్వాల్లో ఉన్న ఝరాసంగం వసతిగృహాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనంతోపాటు కిచెన్ పరిసరాలు, కూరగాయలు నిల్వ ఉంచే ప్రదేశాలను సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వసతిగృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు వడ్డించేందుకు అవసరమయ్యే సామగ్రిని ఎప్పటికప్పుడు తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా సంక్షేమ చర్యలు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment