పథకాల అమలు భేష్
● యూపీఎస్సీ ట్రైనీ అధికారుల బృందం ● ఐదు రోజులపాటు గ్రామంలో పర్యటించిన ట్రైనీ అధికారులు
పటాన్చెరు టౌన్: క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల పనితీరు భేష్ అని యూపీఎస్సీ ట్రైనీ అధికార బృందం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక స్థితిగతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల తీరును తెలుసుకునేందుకు ట్రైనీ బృందం ఈ నెల 23 నుంచి ఐదురోజులపాటు నందిగామ గ్రామంలో పర్యటించింది. గ్రామస్తులు జీవనోపాధి ఎలా పొందుతున్నారు? వారి ఆదాయ మార్గాలు ఏంటి వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. వైకుంఠధామం, నర్సరీలను పరిశీలించారు. వీరి పర్యటనలో చివరిరోజైన బుధవారం ట్రైనీ అధికారులు సరదాగా ఎడ్లబండి ఎక్కి కొద్దిసేపు సందడి చేశారు. అనంతరం ట్రైనీ అధికార బృందాన్ని గ్రామపంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment