ఉపాధి కోసమే ‘మై భారత్ పోర్టల్’
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు 18 నుంచి 29 ఏళ్ల యువత కోసం కేంద్ర ప్రభుత్వం మై భారత్ పోర్టల్‌ను ప్రత్యేకంగా రూపొందించిందని తారా ప్రభుత్వ కళాశాల ప్రినిపాల్ కె.ఎస్.రత్నప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ‘మై భారత్ పోర్టల్’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ఎస్.రత్న ప్రసాద్ మాట్లాడుతూ...యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలు, సాధించిన విజయాలు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి, ప్రభుత్వ పథకాలు పొందే అవకాశముంటుందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామకాలు, ప్రైవేటు సంస్థల్లో చేపట్టే ఉద్యోగ నియామకాలు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు డాక్టర్ సదయ కుమార్, డాక్టర్ జోత్స్న ఇతర అధ్యాపక బృందం, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు రంజిత్‌రెడ్డి, ఎన్‌సీసీ క్యాడేట్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment