జిన్నారం ప్రభుత్వ పాఠశాల సందర్శన
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలంలోని ఖాజిప, వావిలాలతోపాటు జిన్నారంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం తరగతులను పరిశీలించారు. అనంతరం గడ్డపోతారం పాఠశాలతో పాటు ఖాజిపల్లి గ్రామంలో కెమ్టెక్ సహకారంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని సందర్శించారు. పాఠశాలలో గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించాలి
యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయడంతోపాటు విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని జిల్లా మహిళా డిగ్రీ కళాశాలలో విద్యారంగ సమస్యలపై బుధవారం నిర్వహించిన సెమినార్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏడాది పూర్తయినా రేవంత్సర్కార్ వాటి ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు. ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి సర్టిఫికెట్లు తీసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు
పాటించాలి: ప్రభులత
సంగారెడ్డిటౌన్: వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రభులత స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకుని ప్రయాణించాలన్నారు. ప్రయాణం చేసేటప్పుడు రెండు వైపులా రోడ్డును గమనిస్తూ వాహనాలను నడపాలని సూచించారు. అనంతరం డ్రాయింగ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డిపో అధికారులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment