లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి
పటాన్చెరు టౌన్/సంగారెడ్డి: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మాధురితో కలసి ఇస్నాపూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి బస చేశారు. గురుకుల పాఠశాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారి విద్యాభ్యాసం, లక్ష్యాలను చేరుకున్న అనుభవాలను విద్యార్థులకు వివరించారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ...ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటి వద్దే పిల్లలను చూసుకుంటూ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించిన తీరును అదనపు కలెక్టర్ వివరించారు. కళాశాలలో రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటు చేశామని మంచి శిక్షణ పొంది రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించాలని ఆశ భావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ అదనపు కలెక్టర్లు విద్యార్థులతో కలసి నిద్రించారు.
ప్రజాస్వామ్యంలో మీడియాది కీలకపాత్ర
ప్రజాస్వామ్యంలో మీడియాది చాలా కీలక ప్రాతని కలెక్టర్ వల్లూరు క్రాంతి అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్లో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ 2025 డైరీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ప్రజలకు, పాలకులకు వారధిగా ఎప్పటికప్పుడు సమాచారం అందించడం గొప్ప విషయమన్నారు. సమాజం కోసం నిరంతరం పనిచేస్తున్న విలేకరులు ఆదర్శప్రాయులని కొనియాడారు. జర్నలిస్ట్ డైరీని రూపొందించిన అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయినాథ్‌ను అభినందించారు. కార్యక్రమంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సలహాదారుడు సునీల్, గౌరవ అధ్యక్షుడు శంకర్రావు, ఉపాధ్యక్షుడు ఎర్ర.వీరేందర్ గౌడ్, రాజ్ కిశోర్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి
ఇస్నాపూర్ బాలికల గురుకులపాఠశాలలో రాత్రి బస
Comments
Please login to add a commentAdd a comment