మంజీరాలో పుణ్యస్నానాలు
సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
నారాయణఖేడ్: మనూరు మండలంలోని బోరంచ గ్రామంలో సంగమేశ్వర దేవస్థానంలో బుధవారం మాఘ అమావాస్యను పురస్కరించుకుని భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నియోజకవర్గంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి అనుపమారెడ్డి దంపతులిద్దరు మంజీరా నదిలో పుణ్యస్నానమాచరిం గంగా హారతి సమర్పించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్పాటిల్, ఖేడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ తదితరులుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment