బ్రిటన్ షెఫీల్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ప్రీతీరఘునాథ్
పటాన్చెరు: కృత్రిమమేథ (ఏఐ), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)లు అత్యంత ఖర్చు, వ్యయప్రయాసలతో కూడినదైనప్పటికీ దానిని భారతీయులు అందిపుచ్చుకోవాలని బ్రిటన్ షెఫీల్డ్ విశ్వవిద్యాలయం డిజిటల్ మీడియా విభాగం ప్రొఫెసర్ ప్రీతీరఘునాథ్ పేర్కొన్నారు. ‘తెలంగాణలో ఏఐ విధానాలు, మౌలిక సదుపాయాలు, అభ్యాసాలు: ప్రారంభ ముద్రలు’అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో బుధవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా తన పైలట్ పరిశోధన అధ్యయనం ప్రారంభ ఫలితాలను వివరించారు. నిజామాబాద్, హైదరాబాద్ నుంచి రెండు కీలక కేస్ స్టడీలను ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment