
సిద్దిపేటకమాన్: రూ.4కోట్లతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయనున్న టూటౌన్ పోలీసు స్టేషన్ నూతన భవనానికి మంగళవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 10,500 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించనున్నారు. రెండు అంతస్థుల్లో రిసిప్షెన్, ఏఎస్‌ఐ రూం, ఇంటర్వ్యూ గది, లాకప్, ఎస్‌హెచ్‌ఓ రూం, రీడింగ్ రూం, రికార్డు గది, డైనింగ్ హాల్, జిమ్, ఉమెన్ బ్యారెక్, మెయిన్ బ్యారెక్, మీటింగ్ హాల్ ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఆరు నెలల్లో అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment