దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
అదనపు కలెక్టర్‌కు టీఎన్‌జీఓల వినతి
సిద్దిపేటరూరల్: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి చేయడం దారుణమని, వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ అధ్యక్ష, ప్రధానకార్యర్శులు పరమేశ్వర్, విక్రంరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఏది ఆదేశిస్తే అందుకు అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వ ఉద్యోగుల పని అన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న అధికారులపై దాడి చేయడం సరైంది కాదన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ యూనిట్ కార్యదర్శి నగేష్, ఉపేందర్, సుమన్, సాయి, మనోహర్, చైతన్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment