సింగరాయ ప్రాజెక్టులోకి చేప పిల్లలు
కోహెడరూరల్(హుస్నాబాద్): గుండారెడ్డిపల్లి శివారులోని సింగరాయ ప్రాజెక్టులోకి మత్స్య శాఖ డీఎఫ్‌ఓ వర్ధారెడ్డి ఆధ్వర్యంలో చేప పిల్లల ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గుండారెడ్డిపల్లి, తంళపల్లి గ్రామాల మత్స్యకారులు డీఎఫ్‌ఓను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు సుతారి కనుకరాజు, సింగరాయ ప్రాజెక్టు కార్యదర్శి కొత్తూరి యాదగిరి, మేడవేని పరశురాములు, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.
జాతీయ సైక్లింగ్ జట్టు
మేనేజర్‌గా వెంకటనర్సయ్య
అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జంగపల్లి వెంకటనర్సయ్య జాతీయస్థాయి సైక్లింగ్ జట్టుకు మేనేజర్‌గా ఎంపికయ్యారు. చైన్నెలో ఈ నెల 15వ తేదీ నుంచి 19వరకు జాతీయస్థాయి ట్రాక్ సైక్లింగ్ పోటీలు జరగనున్నాయి. మేనేజర్‌గా వెంకటనర్సయ్య ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాధికారి గుగులోతు రంగనాయక్, ఉపాధ్యాయులు, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు అభినందించారు.
పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
గజ్వేల్: మండల పరిధి జాలిగామలోని వాసవీ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులకు పత్తిని అమ్ముకోకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్‌వెస్లీ, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా బయ్యారం రోడ్డు వైపున ఉన్న శివగంగ జిన్నింగ్ మిల్లు, జగదేవ్‌పూర్ మండ లం అలిరాజపేటలోని విశ్వతేజ జిన్నింగ్ మిల్లులలోనూ సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు.
రేపటి నుంచి సిటీ పోలీస్‌యాక్టు
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో గురువారం నుంచి సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉంటాయన్నారు.
సాహితీ పురస్కారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తునందుకు ప్రముఖ కవి ఎన్నవెళ్లి రాజమౌళికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం ప్రదానం చేసినట్లు బాలసాహితీ వేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. ఎన్నవెళ్లి రాజమౌళికి మంగళవారం నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కేవీ రమణ, నిత్యానందరావు, కిషన్‌రావుల చేతుల మీదుగా సాహితీ పురస్కారం, రూ.20వేల నగదును అందించారన్నారు. కార్యక్రమంలో జిల్లా కవులు ఐతా చంద్రయ్య, ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, పెందోట వెంకటేశ్వర్లు, డబ్బికార్ సురేందర్ తదితరులు పాల్గొన్నారన్నారు. రాజమౌళి బాలసాహిత్య పురస్కారం అందుకోవడం పట్ల పలువురు కవులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment