డివిజన్ సాధించి తీరుతాం
30న ప్రజా సంకల్ప దీక్షకు తరలిరండి
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతామని, ఈ నెల 30న తలపెట్టిన ప్రజా సంకల్ప దీక్షకు ప్రజలు తరలిరావాలని జేఏసీ చైర్మన్ రామగళ్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంకల్ప దీక్షను విజయవంతం చేసే దిశగా డివిజన్ స్థాయి, మండల జేఏసీ కమిటీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు ఆగంరెడ్డి, జీవన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, అశోక్, బీరయ్య, రాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment