విద్యార్థుల ఉన్నతికి స్పెల్‌బీ
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహణ
సిద్దిపేటజోన్: విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పదును పెట్టేందుకు స్పెల్‌బీ వేదికగా మారుతుంది. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అంబిటాస్ స్కూల్‌లో స్పెల్‌బీ పరీక్షలు నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన 48 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు ఈలాంటి పరీక్షలకు హాజరు కావడం వల్ల వారిలో ఏకాగ్రత, నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఆనందం నింపేందుకు సాక్షి ఆధ్వర్యంలో చాక్లెట్స్ పంపిణీ చేశారు. పరీక్షలను అంబిటాస్ పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.
ప్రతిసారి పాల్గొంటున్నా..
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించే స్పెల్‌బీ పరీక్షలకు ప్రతిసారి హాజరు అవుతున్నా. గతంలో జిల్లా మొదటి స్థానం సాధించా. ఈసారి మళ్లీ రాస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. పోటీ పరీక్షలకు సులువుగా సిద్ధం అయ్యేందుకు స్పెల్‌బీ ఎంతో ఉపయోగపడుతుంది.
–పూనమ్ శర్మ, అంబిటాస్
మరింత ప్రతిభ
అన్ని విషయాలను తెలుసుకునే అవకాశం స్పెల్‌బీ పరీక్షల ద్వారా కలుగుతుంది. భవిష్యత్తు లో ప్రతి సారి పరీక్షలకు హాజరుకావాలని ఉంది. మాలో మరింత ప్రతిభకు చొరవ చూపుతున్న సాక్షికి థాంక్స్. –రఘువర్ధన్, అంబిటాస్
చాలా ఉపయోగకరం
స్పెల్‌బీ పరీక్షలు రాయడం వల్ల భవిష్యత్తులో పరీక్షలు అంటే ఒక భయం పోతుంది. చాలా చక్కగా, సులువుగా పోటీ పరీక్షలు రాయొచ్చు.. తెలియని విషయాలు కూడా స్పెల్‌బీ ద్వారా తెలుస్తోంది. ఇది మాకు చాలా ఉపయోగకరమైన పరీక్ష.
–అయోష్, వికాస్ స్కూల్ చేర్యాల
Comments
Please login to add a commentAdd a comment