సీసీఐ కొనుగోళ్లు నిరంతరం సాగాలి
గజ్వేల్: సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు నిరంతరంగా సాగేలా చూడాలని, సెలవుల పేరిట తరుచూ నిలిపివేయవద్దని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా కార్యదర్శి మర్కంటి ఏగొండ డిమాండ్ చేశారు. ఆదివారం గజ్వేల్‌లో బీజేపీ నేతలు వెంకట రమణ, దేవులపల్లి మనోహర్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దళారుల నుంచి రైతులను కాపాడటానికే కేంద్రం సీసీఐ అధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను చేపడుతున్నదని చెప్పారు. స్థానిక అధికారులు ఈ కేంద్రాలు సజావుగా నడిచేలా చూడాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment