Ben Stokes Ends Retirement U-turn speculation: ఇంగ్లండ్ అభిమానుల ఆశలపై వన్డే వరల్డ్‌కప్-2019 హీరో బెన్ స్టోక్స్ నీళ్లు చల్లాడు. ఈ ఏడాది జరుగనున్న మెగా టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టాడు. యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత తాను హాలిడే ట్రిప్‌నకు వెళ్లనున్నట్లు తెలిపాడు.
కాగా స్వదేశంలో 2019లో జరిగిన ప్రపంచకప్ ఈవెంట్లో ఇంగ్లండ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లండన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. స్టోక్స్ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా విజయం ఇంగ్లండ్‌ను వరించింది.
అదే మొదటిసారి
ఈ నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు మొట్టమొదటిసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఈసారి భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
ఊహించని నిర్ణయంతో
ఇదిలా ఉంటే.. అభిమానులు, జట్టుకు ఊహించని షాకిస్తూ స్టోక్స్ గతేడాది వన్డేలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అతడు లేకుండానే ఈసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ ఆడనుంది. అయితే, ఇటీవల.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్ మాథ్యూ మాట్, కెప్టెన్ జోస్ బట్లర్.. ఈ ఆల్‌రౌండర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆశలు రేపాయి.
రిటైర్మెంట్ వెనక్కి
బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయట్లు వాళ్లు సంకేతాలు ఇచ్చారు. ఈ విషయమై తాజాగా స్టోక్స్‌ను ప్రశ్నించగా.. ‘‘నేను రిటైర్ అయ్యాను. ఈ టెస్టు ముగిసిన తర్వాత నేను సెలవులు తీసుకుంటాను. ఇప్పటికైతే ఇంతవరకే నేను ఆలోచిస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. దీంతో స్టోక్స్ వన్డే వరల్డ్‌కప్ ఆడే ఛాన్స్ లేదని స్పష్టమైంది.
యాషెస్‌లో మాత్రం
కాగా ఇంగ్లండ్ టెస్టు సారథిగా జో రూట్ నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత బజ్‌బాల్ విధానంతో స్టోక్స్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి దూకుడైన ఆటతో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో మాత్రం వారి పప్పులు ఉడకలేదు.
ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ట్రోఫీని తమ వద్దే పెట్టుకునే అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- ఆసీస్ మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు జరుగనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానం ఇందుకు వేదిక.
చదవండి: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. అలా అయితే సచిన్, గంగూలీ!
Comments
Please login to add a commentAdd a comment