లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో మరో సవరణ చేసేందుకు ఐసీసీ సిద్దమైనట్లు తెలుస్తోంది. తొలుత ఫైనల్ కు అర్హత సాధించే విధానాన్ని(పాయింట్ల విధానం నుంచి విజయాల శాతానికి) మార్చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. తాజాగా ఫైనల్ మ్యాచ్ ను ఆరు రోజుల మ్యాచ్ గా మార్చాలని భావిస్తుంది. ఐదు రోజుల ఆట సాధ్యపడిన తర్వాత కూడా మ్యాచ్ డ్రాగా ముగిస్తే, ఫలితం తేలే నిమిత్తం ఈ మ్యాచ్ ను ఆరో రోజు కూడా కొనసాగించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీని డ్రా ముగించడం ఇష్టం లేని ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, రెండేళ్ల కాలపరిమితితో ప్రవేశ పెట్టిన ఈ మెగా టోర్నీ 2019లో మొదలై 2021తో ముగుస్తుంది. ఈ తొట్ట తొలి టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీలకు భారత్, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. జూన్ 8న సౌతాంఫ్టన్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.
చదవండి: రోజురోజుకు రాటుదేలుతున్నారు..
Comments
Please login to add a commentAdd a comment