బంగ్లాతో తొలి టెస్ట్‌.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా | IND VS BAN 1st Test Day 2 Stumps: Team India In 308 Runs Lead | Sakshi
Sakshi News home page

బంగ్లాతో తొలి టెస్ట్‌.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

Published Fri, Sep 20 2024 6:01 PM | Last Updated on Fri, Sep 20 2024 6:11 PM

IND VS BAN 1st Test Day 2 Stumps: Team India In 308 Runs Lead

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ 308 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకుని) కొనసాగుతుంది. యశస్వి జైస్వాల్‌ (10), రోహిత్‌ శర్మ (5), విరాట్‌ కోహ్లి (17) ఔట్‌ కాగా.. శుభ్‌మన్‌ గిల్‌ (33), రిషబ్‌ పంత్‌ (12) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌, నహిద్‌ రాణా, మెహిది హసన్‌ మీరజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

149 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్‌
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు.. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి బంగ్లా ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. బుమ్రా 4, సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నజ్ముల్‌ షాంటో (20), షకీబ్‌ అల్‌ హసన్‌ (32), లిట్టన్‌ దాస్‌ (22), తస్కిన్‌ అహ్మద్‌ (11), నహిద్‌ రాణా (11), మిరాజ్‌ (27 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత్‌ 227 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

అశ్విన్‌ సూపర్‌ సెంచరీ
రవిచంద్రన్‌ అశ్విన్‌ సూపర్‌ సెంచరీతో (113) చెలరేగడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్‌ (56) అర్ద సెంచరీలతో రాణించారు. పంత్‌ (39) పర్వాలేదనిపించాడు. రోహిత్‌ (6), గిల్‌ (0), కోహ్లి (6), రాహుల్‌ (16) విఫలమయ్యారు. అశ్విన్‌-జడేజా జోడి ఏడో వికెట్‌కు 199 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. కఠినమైన ఎర్రమట్టి పిచ్‌పై వీరిద్దరి బ్యాటింగ్‌ చూడముచ్చటగా ఉండింది. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహమూద్‌ 5, తస్కిన్‌ అహ్మద్‌ 3, నహిద్‌ రాణా, మెహిది హసన్‌ మీరజ్‌ తలో వికెట్‌ తీశారు.

చదవండి: పంత్‌పై సిరాజ్‌ ఆగ్రహం.. రోహిత్‌ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement