India Squad For Australia, South Africa T20Is: భారత సెలెక్టర్లు వరల్డ్ కప్-2022 జట్టును ప్రకటించిన కొద్ది సేపటికే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లకు కూడా జట్లను ప్రకటించారు. ఈ జట్లలో వరల్డ్ కప్ స్క్వాడ్‌లో స్థానం దక్కించుకున్న అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హార్థిక్ పాండ్యాలకు చోటు దక్కలేదు. ఈ సిరీస్‌లు జరిగే సమయంలో వీరు ముగ్గురు ఎన్‌సీఏలో జరిగే కండీషనింగ్ క్యాంప్‌కు హాజరవుతారని సెలెక్టర్లు తెలిపారు.
వీరిలో అర్షదీప్ ఆస్ట్రేలియా సిరీస్‌కు, భువనేశ్వర్ కుమార్, హార్థిక్ పాండ్యాలు సౌతాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉండరని వెల్లడించారు. వీరి స్థానాల్లో మహ్మద్ షమీ, దీపక్ చాహర్‌లు ఈ రెండు సిరీస్‌ల్లో ఆడతారని ప్రకటించారు.
ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈనెల (సెప్టెంబర్) 20 నుంచి, సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇదే నెల (సెప్టెంబర్) 28 నుంచి ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఈనెల 20న మొహాలి వేదికగా, రెండో టీ20 23న నాగ్‌పూర్ వేదికగా, మూడో టీ20 25న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.
అనంతరం సౌతాఫ్రికాతో తొలి టీ20 సెప్టెంబర్ 28న తిరువనంతపురం వేదికగా, రెండో టీ20 అక్టోబర్ 2న గౌహతి వేదికగా, మూడో టీ20 అక్టోబర్ 4న ఇండోర్ వేదికగా జరుతాయి. ఈ సిరీస్ అనంతరం భారత్.. సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఇందు కోసం జట్టును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్
సౌతాఫ్రికాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment