Photo Courtesy: Rajasthan Royals Twitter
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే స్టోక్స్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. స్టోక్స్ ఎడమ చేతి చూపుడు వేలికి ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలడంతో డాక్టర్లు సర్జరీకి సిఫార్సు చేశారు. దీంతో అతను స్వదేశానికి బయల్దేరిపోయాడు. శుక్రవారం రాత్రే ఇంగ్లండ్‌కు స్టోక్స్ పయనమైన విషయాన్ని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాను రాజస్థాన్ జట్టును వీడి వెళ్లడానికి అస్సలు ఇష్టపడలేదు. కానీ సర్జరీ అనివార్యం కావడంతో స్టోక్స్‌ను బలవంతంగా ఇంగ్లండ్‌కు పంపించారు. జట్టుతో పాటే ఉండి ఆఫ్ ద ఫీల్డ్‌లో సలహాలు ఇస్తానని స్టోక్స్ రాజస్థాన్ ఫ్రాంచైజీకి తెలిపాడట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ అవసరం కాబట్టి ఈసీబీ పట్టుబట్టడంతో స్టోక్స్ స్వదేశానికి బయల్దేరక తప్పలేదు.
చాంపియన్ త్వరగా కోలుకో..
రాజస్థాన్‌ను అర్థాంతరంగా స్టోక్స్ వదిలేయడంతో సదరు ఫ్రాంచైజీ అతనికి ఘనంగా వీడ్కోలు పలికింది. అనంతరం తన ట్విటర్ ఖాతాలో స్టోక్స్ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ ఆకాంక్షించింది. ‘బై బెన్.. ఈ ఆల్‌రౌండర్‌కు స్కాన్ చేసిన తర్వాత సర్జరీ అవసరమని తేలింది. అందుచేత గత రాత్రే స్వదేశానికి బయల్దేరిపోయాడు. త్వరగా కోలుకో చాంపియన్’ అని స్టోక్స్ ఫొటో పెట్టి పోస్టు చేసింది.
Goodbyes are difficult. 🥺
— Rajasthan Royals (@rajasthanroyals) April 17, 2021
Until next time, Stokesy. 🤗#RoyalsFamily | @benstokes38 pic.twitter.com/KRyNRrGuqQ
ఫ్యాన్స్ భావోద్వేగం
రాజస్థాన్‌ను స్టోక్స్ వీడిన తర్వాత ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనవుతూ ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘నీకు సర్జరీ అనివార్యం కావడంతో ఈ ఐపీఎల్‌లో నీ మెరుపుల్ని మిస్సవుతున్నాం’ అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, ‘అవును డ్యూడ్. నువ్వు రాజస్థాన్‌కు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌వి. టేక్ కేర్’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘నిన్ను తప్పకుండా మిస్సవుతాం చాంపియన్. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో స్టోక్స్ స్థానాన్ని అలాగే ఉంచండి. అతన్ని జట్టుతో కొనసాగించండి ఆర్‌ఆర్.. ప్లీజ్’ అని మరొక ఫ్యాన్ స్పందించాడు.
Comments
Please login to add a commentAdd a comment