Photo Courtesy: Rajasthan Royals Twitter
ముంబై: రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్టోక్స్ ఎడమ చేతి వేలికి గాయమైంది. స్కానింగ్‌లో స్టోక్స్ వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దాంతో అతను మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైనట్లు రాజస్తాన్ రాయల్స్ తెలిపింది. ఈ మేరకు ‘‘రాజస్తాన్ రాయల్స్ జట్టులోని ప్రతి ఆటగాడు బెన్‌స్టోక్స్‌ను ఎంతగానో ప్రేమిస్తాడు. జట్టుకు ఉన్న అతిపెద్ద ఆస్తి అతడు. మైదానం లోపల, వెలుపల రాయల్స్ కుటుంబంలో అతడికి తగినంత ప్రాధాన్యం ఉంది. స్టోక్స్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. త్వరలోనే తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని సిద్ధం చేస్తాం’’ అని ప్రకటనలో పేర్కొంది.
కాగా వారం రోజులు భారత్‌లో విశ్రాంతి తీసుకున్నాక అతను ఇంగ్లండ్‌కు బయలుదేరుతాడు. ఇక సోమవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో రాజస్తాన్ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్టోక్స్ పరుగులేమీ చేయకుండానే షమీ బౌలింగ్‌లో వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.
చదవండి: ఇంకేం చేయగలను: సంజూ సామ్సన్ భావోద్వేగం
బట్లర్‌తో ఎందుకు ఓపెనింగ్ చేయించలేదు.. ఏమనుకుంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment