ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి చవి చూసిన విషయం విధితమే. టెస్టు క్రికెట్‌లో "బజ్‌బాల్" అంటూ దూకుడే మంత్రంగా పెట్టుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ గట్టి షాకిచ్చింది. అయితే ఇంగ్లండ్ ఆడుతున్న విధానాన్ని కొంతమంది సమర్థిస్తుంటుంటే మరి కొంత మంది విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వాఖ్యలు చేశాడు. బజ్‌బాల్‌కు తాను ఒక అభిమానినని, కాని యాషెస్ సిరీస్‌లో మాత్రం కొంచెం తెలివిగా ఆడాలని ఇంగ్లండ్ జట్టుకు వాన్ సూచించాడు. కాగా బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లీష్ జట్టు టెస్టుల్లో గొత కొంతకాలంగా అద్బుతంగా రాణిస్తోంది.
స్టోక్స్ నేతృత్వంలోని ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. ఇక జూన్ 28న లార్డ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. "లార్డ్స్ టెస్టులో రెండు జట్లలో కొన్ని మార్పులు కన్పించవచ్చు. అయితే ఆసీస్ మాత్రం తొలి మ్యాచ్ విజయంతో మరింత జోష్‌లో బరిలోకి దిగుతారు.
ఆసీస్ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాటర్లకు కాస్త జాగ్రత్తగా ఎదుర్కొవాలి. బజ్‌బాల్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే అన్నివేళలా అది సరికాదు. ఆస్ట్రేలియా వంటి జట్టుతో మనం ఆడుతున్నప్పుడు కొంచెం తెలివిగా ఉండాలి. ఆస్ట్రేలియా వెనకడుగు వేసినప్పుడు, దాన్ని మరింత వెనక్కినెట్టే ఎత్తులు కావాలి.
తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆపని చేయలేకపోయింది. రెండు సార్లు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడంలో ఇంగ్లండ్ విఫలమైంది. ఈ సారి కూడా రల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించకపోతే, బాజ్‌బాల్‌కు అర్దం ఉండదు అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: అప్పుడు ధోని బాగా ఫీలయ్యాడు.. కానీ అక్కడ జడ్డూ ఉన్నాడు కదా: సీఎస్‌కే సీఈవో
Comments
Please login to add a commentAdd a comment