రషీద్‌ భయ్యా ఏంటి ఈ గందరగోళం.. వీడియో వైరల్‌ | Rashid Khan Hilarious Misfield Rolling On-Field Concedes Runs Overthrow | Sakshi
Sakshi News home page

IPL 2022: రషీద్‌ భయ్యా ఏంటి ఈ గందరగోళం.. వీడియో వైరల్‌

Published Fri, May 6 2022 9:54 PM | Last Updated on Fri, May 6 2022 10:13 PM

Rashid Khan Hilarious Misfield Rolling On-Field Concedes Runs Overthrow - Sakshi

PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో రషీద్‌ ఖాన్‌ మిస్‌ ఫీల్డింగ్‌ నవ్వులు పూయించింది. ప్రదీప్‌ సంగ్వాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో రెండో బంతిని ఇషాన్‌ కిషన్‌ కవర్స్‌ దిశగా ఆడాడు. అయితే బంతిని అందుకున్న రషీద్‌ త్రో విసరడంలో విఫలమయ్యాడు. బంతి అతని కాళ్లను తాకి మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో మళ్లీ పరిగెత్తిన రషీద్‌ బంతిని అందుకోబోయి పట్టుతప్పి కిందపడ్డాడు.

ఈసారి వేగంగా త్రో వేసినప్పటికి మిడిల్‌ స్టంప్‌ మిస్‌ అయి బౌండరీ దిశగా పరిగెట్టింది. ఇంతలో మరో ఫీల్డర్‌ బంతిని అందుకున్నాడు. ఈ గ్యాప్‌లో ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మలు రెండు రన్స్‌ పూర్తి చేశారు. ఇదంతా గమనించిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా రషీద్‌ వద్దకు వచ్చి ఏంటిది అన్నట్లు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదే రషీద్‌ ఖాన్‌ దాటిగా ఆడుతున్న రోహిత్‌ను ఔట్‌ చేశాడు. రోహిత్‌ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement