ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటిన భారత యువ క్రికెటర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ సంస్థకు చెందిన ఎస్‌యూవీ థార్ వాహనాలను బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఆనంద్ మహీంద్రా తనకు గిఫ్ట్‌గా పంపిన థార్ ఎస్‌యూవీ ముందు నిలబడి ఫోటోకు ఫోజిచ్చాడు. అనంతరం ట్విటర్ వేదికగా ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు.
''మహీంద్రా జీ.. మీరు పంపిన థార్ ఎస్‌యూవీ ఇప్పుడే వచ్చింది. మీరిచ్చిన గిఫ్ట్ కంటే మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. నాకు ఇష్టమైన ఎస్‌యూవీ కారును గిఫ్ట్‌గా పంపారు.. దీనిని నడపుతుంటే తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆసీస్ టూర్ తర్వాత లభిస్తున్న ప్రశంసల్లో మీది ప్రత్యేకంగా కనిపించింది. దేశానికి మేం చేస్తున్న సేవలకు గుర్తుగా మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.''అంటూ కామెంట్ చేశాడు. కాగా, నటరాజన్, శార్దూల్‌తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీలు కూడా అందుకున్నారు. చదవండి: ఆనంద్ మహీంద్రాకు నట్టూ రిటర్న్ గిఫ్ట్..
కాగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్, సుందర్ ద్వయం ఏడో వికెట్‌కు 123 పరుగులు జోడించడంతో టీమిండియా 336 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. శార్దూల్ 67, సుందర్ 62 పరుగులు చేశారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియా ముందు 329 పరుగుల లక్ష్యం ఏర్పడింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ 91 పరుగులు.. రిషబ్ పంత్ 89 పరుగులు నాటౌట్‌తో విజృంభించడంతో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేయడంతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1 తేడాతో సగర్వంగా ఎగురేసుకుపోయింది.
చదవండి: ఆ వేలు ఎవరికి చూపించావు.. శార్దూల్
IPL 2021: కెప్టెన్‌గా ధోని.. రైనాకు దక్కని చోటు
New Mahindra Thar has arrived!! @MahindraRise has built an absolute beast & I’m so happy to drive this SUV. A gesture that youth of our nation will look upto. Thank you once again Shri @anandmahindra ji, @pakwakankar ji for recognising our contribution on the tour of Australia. pic.twitter.com/eb69iLrjYb
— Shardul Thakur (@imShard) April 1, 2021
Comments
Please login to add a commentAdd a comment