మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. అనవసరంగా: సిక్కిరెడ్డి తల్లి | Sikki Reddy Mother Responds Over KP Chowdary Case | Sakshi
Sakshi News home page

KP Chowdary Case: మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. వారం రోజులు ఇల్లు కావాలంటే: సిక్కిరెడ్డి తల్లి

Published Sat, Jun 24 2023 9:02 PM | Last Updated on Sat, Jun 24 2023 9:16 PM

Sikki Reddy Mother Responds Over KP Chowdary Case - Sakshi

KP Chowdary Case: తమ కూతురికి డ్రగ్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదని బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సిక్కిరెడ్డి తల్లి మాధవి స్పష్టం చేశారు. కనీస విచారణ చేయకుండా.. తన ఆటతో దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన సిక్కిరెడ్డి పేరును కస్టడీ రిపోర్ట్ లో పెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

పలువురు సెలబ్రిటీలతో అతడికి సత్సంబంధాలు ఉన్నాయన్న వార్తలు టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. అదే విధంగా కస్టడీ రిపోర్టులో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సిక్కిరెడ్డి పేరు ఉండటం విస్మయపరిచింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి మాధవి మీడియాతో మాట్లాడారు. కేపీ చౌదరితో తమ బిడ్డకు అసలు పరిచయమే లేదని తెలిపారు. ఇల్లు కావాలంటే వారం రోజుల పాటు కేపీ చౌదరిని తమ నివాసంలో ఉండమని చెప్పామే తప్ప అతడు ఇలాంటి వాడని తెలియదని వాపోయారు.

వారం రోజులు ఇల్లు కావాలంటే
‘‘మాకు 2011 నుంచి కేపీ చౌదరి తెలుసు. ఒక వారం రోజుల పాటు ఇల్లు కావాలంటే స్నేహితహిల్స్లో ఉన్న మా ఇంట్లో ఉండమని చెప్పాను. కానీ అతడికి డ్రగ్స్ అలవాటు ఉందని మాకు తెలియదు. ఇప్పటికే పోలీసులు వచ్చి స్నేహిత హిల్స్ లో ఉన్న ఇంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. సిక్కిరెడ్డికి ఇంకా ఈ విషయం తెలియదు. నా బిడ్డకు కేపీ చౌదరికి ఎలాంటి పరిచయం లేదు. కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోండి. మా అమ్మాయి పార్టీలకు వెళ్లదు.. మందు అలవాటు లేదు. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం’’ అని సిక్కిరెడ్డి తల్లి మాధవి అన్నారు.

చదవండి: ఆమె అందానికి క్లీన్‌బౌల్డ్‌! షేన్‌ వార్న్‌తో బార్‌లో తొలిసారి చూశా.. సంపాదనలోనూ
పెను సంచలనం.. విండీస్‌ను మట్టికరిపించిన పసికూన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement