
టీ20 ప్రపంచకప్-2022కు ముందు దక్షిణాఫ్రికా భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అదే విధంగా ప్రస్తుతం భారత్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్ నుంచి కూడా అతడు తప్పుకున్నాడు.
టీమిండియాతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్ ప్రాక్టీస్ సెషన్‌లో అతడి ఎడమ బొటన వేలి ఫ్రాక్చర్ అయింది. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా గురువారం ధృవీకరించింది. ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ ఎడమ బొటన వేలి ఫ్రాక్చర్ కారణంగా భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ప్రపంచకప్‌కు దూరమయ్యాడు అని క్రికెట్ సౌతాఫ్రికా ట్విటర్‌లో పేర్కొంది.
కాగా భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడి స్థానంలో మార్కో జాన్సెన్ దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌కు ప్రిటోరియస్ స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేయనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ తెలిపింది. అయితే అతడి స్థానంలో యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ లేదా వైన్ పార్నల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
చదవండి: India vs South Africa: సంజూ పోరాటం వృదా.. తొలి వన్డేలో భారత్ ఓటమి