అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. జోసెఫ్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కోహ్లి.. నాలుగో బంతిని హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని ఫీల్డర్ చేతికి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆటతీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా స్టార్ స్పోర్ట్స్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. కోహ్లి ఔటైన తీరును విశ్లేషించాడు."దక్షిణాఫ్రికాతో వన్డేల్లో బౌలర్లు కోహ్లిని ఇలా ఔట్ చేయడానికి ప్రయత్నించారు.
సాధారణంగా బ్యాటర్లు హుక్ షాట్ ఆడటానినికి ఇష్టపడరు. కానీ విరాట్ మాత్రం హుక్ షాట్ ఆడటానికి ఇష్టపడతాడు. అక్కడే విరాట్ తప్పు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ షాట్ ఆడే సమయంలో మనం బాడీ మీద నియంత్రణ కోల్పోవాల్సి వస్తుంది. విండీస్‌తో తొలి వన్డేలో అది జరగింది. అతడు కొంచెం ఎక్కువ బౌన్స్ అయిన బంతిని ఎంచుకున్నాడు. విరాట్ ఊహించిన విధంగా అది బ్యాట్ మధ్యలో తగలలేదు. అది ఆఫ్ ఎడ్జ్ తీసుకుని ఫీల్డర్ చేతికి వెళ్లింది. కాబట్టి రాబోయే మ్యాచ్‌ల్లో మరిన్ని బౌన్సర్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్!
Comments
Please login to add a commentAdd a comment