టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌తో రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో PC: BCCI)
ICC WC 2023- Ind vs SL- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో సారథిగా జట్టును విజయపథంలో నడపడంతో పాటు బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఇప్పటికే రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రోహిత్ .. 398 రన్స్‌తో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక ప్రత్యర్థి జట్ల ఎత్తులు చిత్తు చేసే వ్యూహాలతో టీమిండియాకు వరుసగా ఆరు విజయాలు అందించిన హిట్‌మ్యాన్.. జట్టుకు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్ ప్రయాణం సజావుగా సాగేందుకు వీలుగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తానే స్వయంగా పూనుకున్నాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసి
లక్నోలో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్(9), విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(4) చేతులెత్తేసిన వేళ ఓపెనర్ రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు రాబట్టాడు.
వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్(39), సూర్యకుమార్ యాదవ్(49)కెప్టెన్‌కు తోడుగా రాణించడంతో భారత్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 229 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ 129 పరుగులకే కుప్పకూలగా.. 100 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన దాదాపుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక ఆ లాంఛనం పూర్తి కావాలంటే మరుసటి మ్యాచ్‌లోనూ విజయభేరి మోగించాల్సి ఉంది.
ఇదేంటి ఇలా అయిపోయింది
కాగా భారత జట్టు తదుపరి శ్రీలంకతో తలపడనున్న విషయం తెలిసిందే. ముంబైలో వాంఖడే స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా అక్కడికి చేరుకోగా.. రోహిత్ శర్మ ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్‌గా మారింది.
‘‘ముంబై.. అసలేంటిదంతా.. ఇలా అయిపోయింది?’’ అంటూ మాస్కు ధరించిన, విచారకరంగా ఉన్న ఎమోజీలను హిట్‌మ్యాన్ జతచేశాడు. దేశ వాణిజ్య రాజధానిలో కాలుష్య తీవ్రతకు అద్దం పట్టేలా ఉన్న ఫొటోకు ఈ మేరకు క్యాప్షన్ జతచేశాడు ఈ ముంబై బ్యాటర్. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ఐసీసీ వంటి మెగా ఈవెంట్లో రోహిత్ శర్మ తొలిసారిగా తన హోంగ్రౌండ్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు.
చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్ ఆఫ్రిది.. తొలి బౌలర్‌గా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment