ఐఐటీ చదవాలన్నదే ధ్యేయం | Sakshi
Sakshi News home page

ఐఐటీ చదవాలన్నదే ధ్యేయం

Published Thu, May 9 2024 4:45 AM

ఐఐటీ

పాలిసెట్‌

ఫలితాల విడుదల

నెల్లూరు(అర్బన్‌): పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ సాంకేతిక కోర్సుల్లో ప్రవేశానికి గత నెల్లో నిర్వహించిన పాలిసెట్‌ ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. నెల్లూరు, కావలి, ఆత్మకూరులోని ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 3325 మంది దరఖాస్తు చేసుకోగా, 2995 మంది ఉత్తీర్ణత సాధించారు. 90.08 శాతంగా ఉత్తీర్ణత నమోదైందని పాలిసెట్‌ జిల్లా కన్వీనర్‌ విజయకుమార్‌ తెలిపారు. నగరానికి చెందిన మునిసాయి ప్రీతమ్‌ 160, సాయికిరణ్‌ 177, సాయిసాత్విక్‌ 183 ర్యాంకులను సాధించారు.

నన్ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. 160వ ర్యాంక్‌ను సాధించడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో కష్టపడి ఐఐటీ చదవాలన్నదే నా ధ్యేయం.

– మునిసాయి ప్రీతమ్‌, నెల్లూరు

నూతన ఆవిష్కరణలకు కృషి

పాలిసెట్‌లో మంచి ర్యాంక్‌ను సాధించడం సంతోషంగా ఉంది. బాగా కష్టపడి చదివి ఐఐటీలో సీటు సాధిస్తా. నూతన ఆవిష్కరణలు చేసి సమాజానికి ఉపయోగపడాలనేదే నా ఆశయం.

– సాయిసాత్విక్‌, నెల్లూరు

ఐఐటీ చదవాలన్నదే ధ్యేయం
1/1

ఐఐటీ చదవాలన్నదే ధ్యేయం

Advertisement
 
Advertisement
 
Advertisement