జేసీ సంతకం ఫోర్జరీ | - | Sakshi
Sakshi News home page

జేసీ సంతకం ఫోర్జరీ

Published Wed, Jan 29 2025 12:07 AM | Last Updated on Wed, Jan 29 2025 12:07 AM

-

నెల్లూరు రూరల్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు

ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు

నెల్లూరు (క్రైమ్‌): నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ప్రొసీడింగ్స్‌ తయారు చేసిన నిందితులపై దర్గామిట్ట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరురూరల్‌ మండలం కనుపర్తిపాడులోని ఓ సర్వే నంబర్‌లో 4.25 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో వివరాలు సక్రమంగా లేనందున్న వాటిని సరిదిద్దాలని జయప్రసాద్‌రావు, సురేష్‌ అనే వ్యక్తులు ఇటీవల నెల్లూరు రూరల్‌ తహసీల్దార్‌ లాజరస్‌ను కలిసి నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌ పేరిట ఉన్న ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. తహసీల్దార్‌ ప్రొసీడింగ్స్‌ ఫైల్‌ నంబర్‌ను పరిశీలించగా అది జనన ధ్రువీకరణ పత్రానికి సంబంధించినదిగా తేలింది. నకిలీ ప్రొసీడింగ్స్‌గా గుర్తించిన తహసీల్దార్‌ మరింత లోతుగా వివరాలు సేకరించారు. 4.25 ఎకరాల భూమిని కాజేసేందుకు ధనుంజయ్‌, చంద్రశేఖర్‌ అనే ఇద్దరు వ్యక్తులు కోవూరు కు చెందిన మహీంద్ర అనే వ్యక్తికి రూ.8 లక్షల నగదు ఇచ్చి జేసీ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ప్రొసీడింగ్స్‌ను తయారు చేయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆయన ఈ విషయాన్ని జేసి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తహసీల్దార్‌ లాజరస్‌ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు నకిలీ ప్రొసీడింగ్స్‌ తయారు చేసిన, తయారు చేయించిన వారందరిపై కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement