పళ్లిపట్టు: పాతిక వేలకు కన్న తండ్రే తన పదేళ్ల కుమార్తెను అమ్మేశాడు. కొనుక్కున్న వ్యక్తి ఆ చిన్నారితో బాతులు మేపే వెట్టిచాకిరి పనులు చేయిస్తుండగా, రాత్రి సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఆర్కేపేట ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య దంపతులకు 10 మంది పిల్లల్లో ముగ్గురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద అమ్మాయికి 27 ఏళ్లు కాగా, చిన్న పాపకు రెండేళ్లు. రమణయ్య భార్య అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లలను తిరుపతికి తీసుకొచ్చి భిక్షాటనకు పెట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నగరికి చెందిన బాలాజీ తిరుత్తణి శివారులో బాతులు మేపుకొంటూ ఉండే సమయంలో రమణయ్యతో పరిచయం ఏర్పడింది. బాతులు మేపేందుకు వీలుగా తన ఐదో కూతురు మల్లిక (10)ను తీసుకెళ్లమని, అందుకు తనకు రూ. 25 వేలు ఇవ్వాలని అడిగినట్లు, అందుకు అంగీకరించిన బాలాజీ రూ. 25 వేలు ఇచ్చి బాలికను తీసుకెళ్లాడు. నగరిలో కొద్ది రోజులు బాతులు మేపిన తర్వాత తమిళనాడులోని పళ్లిపట్టు సమీపం ఆర్కేపేట మండలంలోని మీసరగాండాపురం చెరువు కట్ట వద్ద టెంటు వేసి బాతులు మేపుకుంటున్నారు. వారితో ఉన్న చిన్నారి సోమవారం రాత్రి సమయంలో కేకలు వేస్తూ సమీపంలోని గ్రామంలోకి పరుగులు తీసింది. గ్రామస్తులు చిన్నారిని రక్షించి పోలీసులకు అప్పగించారు. ఆర్కేపేట పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారిని తిరువళ్లూరులోని చిన్నారుల సంక్షేమ వసతిగృహానికి తరలించారు. స్థానిక డీఎస్పీ కేసు విచారణ చేస్తున్నారు.
బాతులు మేపుతూ వెట్టిచాకిరి చేస్తున్న చిన్నారి
రాత్రి వేళ పారిపోతుండగా
కాపాడిన గ్రామస్తులు
ఆర్కేపేట పోలీసుల విచారణ
Comments
Please login to add a commentAdd a comment